ప్రెస్ మీట్‌లో బిజెపి నేత గురురాజ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు

0
2

నందవరం: నాబార్డ్ నిధులతో ఆధునిక మార్కెట్ నిర్మాణం – గురురాజ్ దేశాయ్

నందవరం బిజెపి కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ ఆధ్వర్యంలో నాబార్డ్ అధికారుల సమావేశం జరిగింది. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన నాబార్డ్ ప్రతినిధి దామోదర రెడ్డి, గ్రామంలో మార్కెట్ నిర్మాణానికి 15 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

దీనికోసం పంచాయతీ 20 సెంట్ల స్థలం కేటాయించాల్సి ఉండగా, ఎంపీడీఓ సానుకూలంగా స్పందించి స్థల పరిశీలన చేశారు. ఈ నిధులతో ఆధునిక మార్కెట్, వాష్రూమ్స్ నిర్మించి పంచాయతీకి అప్పగిస్తారని గురురాజ్ దేశాయ్ తెలిపారు. నాగాలదిన్నె, హలహర్వి గ్రామాల్లోనూ నాబార్డ్ సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.