దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ బయటకు రావడం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా తగినంత నీరు తాగుతూ, ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, రానున్న కొన్ని రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
@reporter SIVAJI






