మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మదనపల్లెకు వచ్చి, తిరుగు ప్రయాణంలో చేనేతనగర్లోని కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో పాటు వృద్ధుడు గాయపడ్డారు. వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వృద్ధుడి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.










