రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు

0
2

రామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్ కొరత వదంతులు నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు భారీ సంఖ్యలో బంకులకు చేరుకొని ట్యాంకులను నింపుకున్నారు.

ఎన్నడు లేని విధంగా అర్ధరాత్రి సమయంలోను జనం క్యూ కట్టడం చూసి బంక్ యజమానులు సైతం ఆశ్చర్యపోయారు. అటు ప్రభుత్వం పెట్రోల్ గురించి ఎటువంటి  వదంతులను నమ్మవద్దని సూచిస్తుంది.