మొయినాబాద్, మార్చి 25 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్
నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రముఖులు అవుసుల సాయి నందు చారి, సహ ప్రముఖుడు కేసరి ముమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని ప్రకటించారు. సంస్థ బలోపేతం, యువతలో దేశభక్తి, సేవా కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేందుకు కమిటీ కృషి చేయాలని వారు సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బజరంగ్ దళ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. యువత ముందుకు వచ్చి సంస్థ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి సృజన్ గౌడ్, రోహిత్ రెడ్డి, అభి యాదవ్, అరవింద్ గౌడ్, పాశం మనిషి, శశిధర్ రెడ్డి, దుర్గం చందు, యుగంధర్ రెడ్డి, సన్నీ యాదవ్, కార్యకర్తలు మరియు యువకులు పాల్గొన్నారు.










