మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు

0
0

జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..

దివ్యాంగులకు ఉపాధి అవకాశం
శ్రీకాకుళం, మార్చి 24: జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు గౌరవ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయస్థానం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి గల అర్హులు తమ టెండర్లను ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కోర్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కెఫేకు సంబంధించిన విద్యుత్ వినియోగ ఛార్జీలను టెండర్ దక్కించుకున్న వారే భరించాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది