రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి

0
0

_రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు_

 

– _ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో ఉన్న రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించారు._

 

– ఈ సందర్భంగా రెడ్డి జనసంఘం సభ్యులు మరియు స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు సమావేశమై కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవన నిర్మాణం మరియు సమాజ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించి, అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అలాగే రెడ్ల శ్మశాన వాటికను కూడా సందర్శించారు._

 

_ఈ కార్యక్రమంలో రెడ్డి జనసంఘం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు._