మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.

0
3

మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని పొలం వద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది.

ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.