శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, స్కిల్ దునియా, ప్రెస్‌మీన్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్, నాగార్జున అగ్రికెమ్, కాన్సెంట్రిక్స్ ఫార్మా, పీఎంజే జ్యూయలరీ, జాయ్ అలుక్కాస్, డెక్కన్ కెమికల్, ఐ స్మార్ట్ సొల్యూషన్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 500పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ నెల్లూరు, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నంబర్, బయోడేటా, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్, జెరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొ టోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రాంగణానికి హాజరుకావాలని, వివరాలకు 95509 67353 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.










