అన్నదాతలకు అండగా తెలుగుదేశం: ‘అన్నదాత సుఖీభవ’లో గుడిసె కృష్ణమ్మ.

0
2

_నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు – డోర్ టు డోర్ కార్యక్రమం | `అన్నదాత సుఖీభవ` కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.*_

– _మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ సంవత్సరానికి రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన విషయాన్ని గ్రామ ప్రజలకు వివరించి, రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు.*_

– _ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి చిన్నకొత్తిలి గ్రామంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. తాను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.*_

– _అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటి సరఫరా, కొత్త రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, ప్రజా సమస్యలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*_

_ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_