ORS వివాదం: చిన్నారుల డాక్టర్‌కు నోటీసులు.. వైద్య లోకంలో కలకలం.

0
2

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని FAIMA, HRDA వంటి వైద్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న డ్రింక్స్‌ను ‘ORS’ పేరుతో విక్రయించడాన్ని ఆమె ఎనిమిదేళ్లుగా ఎదిరిస్తున్నారు.

ఆమె పోరాటంతో FSSAI సదరు ఉత్పత్తులపై ‘ORS’ పేరు వాడరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమెను భయపెట్టేందుకు ఫార్మా సంస్థలు నోటీసులు ఇచ్చాయని, వీటిని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని వైద్య సంఘాలు హెచ్చరించాయి. రోగుల భద్రత కోసం గళమెత్తిన వైద్యురాలికి అండగా నిలుస్తామని స్పష్టం చేశాయి.