కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.

0
2

కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున తిరిగి వస్తుండగా, రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్‌తో ఢీకొట్టాడు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సమీర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.