గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.

0
3

చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు. బాపట్ల జిల్లా IPS బి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ dsp మోయిన్ గారి ఆధ్వర్యంలో శక్తి టీమ్స్ సభ్యులు సిహెచ్ సునీత ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి సెల్ ఫోన్స్ లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అలాగే ఆపద సమయంలో యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియపరిచినారు అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియపరిచినారు చిన్న పిల్లలు వాహనాలు  నరపరాదని అలా మైన డ్రైవింగ్ చేసిన ఎడల వారిపై కేసులు బుక్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వరాదని. తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ లు ఓపెన్ చేయరాదని ఓటీపీలు ఎవరికి చెప్పరాదని అలా చెప్పిన ఎడల సైబర్ క్రైమ్ కి గురి అవుతారని అలాగే పిల్లలు సెల్ఫోన్ లు చూస్టూనట్లయితే వారు ఫోన్లో ఏం చేస్తున్నారు గమనించుకోవాలని పిల్లల్ని ఎవ్వరికీ ఇచ్చి బయటకి పంపించరాదని తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు సిహెచ్ సునీత మరియు ఈ మీటింగ్ కి సహకరించినటువంటి ఆకురాతి రేవంత్ కి మరియు మహిళలు కి పెద్దవారందరికీ పిల్లలందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.

 

#Narendra