శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పాతపట్నం-హిరమండలం పరిధిలోని ఈ సంఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది.”చదువు చెబుతాను” అంటూ నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి..
కాలయముడిగా మారి పలు మార్లు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా.. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.










