తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్

0
3

శ్రీరామ నవమి వేడుకల్లో కవిత: నిజామాబాద్‌లో కీలక ప్రకటనకు సిద్ధం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రేపు నిజామాబాద్ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఖిల్లా రాంమందిర్‌లో తన భర్త అనిల్ గారితో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని డిచ్‌పల్లి, బోధన్, ఆర్మూర్, జగిత్యాల వంటి పలు ప్రధాన రామాలయాల్లో కవిత దంపతుల తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ పర్వదినాన ఆమె చేయబోయే రాజకీయ లేదా సామాజిక ప్రకటనపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.