పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం

0
2

చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల వారితో సమావేశం ఏర్పాటు చేశారు
సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మార్పులు, వివిధ అంశాలపై రాజకీయ పార్టీల తోటి మాట్లాడారు, గత సమావేశంలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించమని చెప్పామని తదుపరి సమావేశంలో ఖచ్చితంగా బి ఎల్ ఎ ల లిస్టు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం ఎమ్మార్వో గీతా రాణి,వేటపాలెం ఎంపీడీవో రాజేష్,చీరాల మున్సిపల్ కమిషనర్ డేనియల్,
తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్, వైఎస్ఆర్సిపి పార్టీ నుండి  పట్టణ అధ్యక్షుడు యాతం మేరి బాబు, జనసేన పార్టీ నుండి జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, వేటపాలెం జనసేన మండలాధ్యక్షులు డాక్టర్ ఉగ్గిరాల మార్కండేయులు, సిపిఎం పార్టీ నుండి నల్లతోటి బాబురావు, బీఎస్పీ పార్టీ నుండి నేతాజీ భగత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ అలీమ్, మరియు ఆర్డీవో ఎంఆర్ఓ ఎంపీడీవో,మున్సిపల్,అధికారులు పాల్గొన్నారు