రామగుండం నియోజకవర్గ పరిధిలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ తో పాటు ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సింగరేణి ఆర్ జవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సతి సమేతంగా ఈ ప్రాంతంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథులుగా వేరు వేరుగా హాజరయ్యారు. ప్రధాన కోదండ రామాలయానికి ఎమ్మెల్యే తన సతీమణితో పట్టు వస్త్రాలతో తలంబ్రాలను నెత్తిపై తాంబూలంలో పెట్టుకొని వచ్చి బ్రాహ్మణులకు రామాలయంలో అందజేశారు. ఆ తర్వాత ఆర్జి వన్ జనరల్ మేనేజర్ జిఎం కాలనీ శారద నగర్ ఏరియాలో ఉండే దేవాలయాలకు అతిథులుగా హాజరై పూజలు స్వీకరించి అక్కడి భక్తులు కోరిన కోరికలను తప్పకుండా సమకూరుస్తానని హామీలు ఇచ్చారు. అలాగే జిఎం కాలనీలో ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు పాల్గొన్నారు. గుండెబోయిన వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 60 డివిజనల్ లో ఉండేటువంటి ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద ఎనిమిదవ కాలనీ, విట్టల్ నగర్, తిలక్ నగర్ రమేష్ నగర్ కళ్యాణ్ నగర్ గౌతమి నగర్ ద్వారకా నగర్ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి పాలకుర్తి అంతర్గాం మండలాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ అంటూ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతల కొడుతూ ప్రతి దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు.
రంగు శ్రీనివాస్
రామగుండం మండలం రిపోర్టర్
పెద్దపల్లి జిల్లా









