శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్ అయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్‌సైట్‌లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 1800425 8599 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.









