ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నాంది: ఎమ్మెల్యే బొండా ఉమ
విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ గారి కృషి ఫలితంగానే ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ రాష్ట్రానికి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ ప్లాంట్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, “జాబ్స్ ఫస్ట్” విధానంలో భాగంగా స్థానిక యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. 5,465 ఎకరాల్లో నిర్మించబడే ఈ పరిశ్రమ ద్వారా మౌలిక వసతులు మెరుగుపడి, రాష్ట్రం ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.










