చల్లపల్లిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు సేవా స్ఫూర్తితో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానమని, చిరంజీవి గారి సేవాగుణాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చరణ్ అభిమానులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారని కొనియాడారు.
రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పద్మావతి హాస్పిటల్ వద్ద జరిగిన ఈ శిబిరంలో 35 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు మరియు మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










