గంజాయి చాక్లెట్ల కలకలం: తిరుపతి వెళ్తున్న రైలులో 8 మంది స్మగ్లర్ల అరెస్ట్.

0
4

చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బాపట్ల ఎస్బి సీఐ రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల పోలీసులు మరియు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ లో భాగంగా  పొన్నూరు నుండి చీరాల వరకు నిర్వహించిన తనిఖీలలో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ స్వాధీనం.
ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు, గంజాయి కలిపిన చాక్లెట్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం సుమారు 8 కిలోల గంజాయితో పాటు దాదాపు 80 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

 

#Narendra