జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని అతివేగంతో వెళ్తూ ఓ బైక్ ఢీ కొట్టింది.
ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విశాఖపట్నంలోని జాలారిపేటకు చెందిన తల్లి నాగమణి (59) కొడుకు నరేంద్ర కుమార్ (32)లుగా పోలీసులు గుర్తించారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామినీ దర్శించుకుని తిరిగి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిలకపాలేం సమీపంలోకి రాగానే అతి వేగం ప్రాణాలు తీసింది. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న CC కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటనపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు శ్రీకాకుళం GGH కి తరలించారు.










