నాణ్యత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం

0
1

నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*

క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*

చల్లపల్లి: ప్రధాన రహదారుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతోందని విజయవాడ క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ బాషా తెలిపారు. గురువారం ఆయన చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో సీపీఎస్ స్కూల్ మీదుగా ఎన్.హెచ్-216 వరకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులు రూ.45లక్షలతో నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణంలో వినియోగించిన మెటీరియల్ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డీఈ పగడాల సురేష్ బాబు, ఏఈ బొప్పన శ్రీనివాసరావు పాల్గొన్నారు.