పుంగునూరు పట్టణంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది

0
1

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జయప్ప పార్వతమ్మ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ధనుంజయ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్ప పార్వతమ్మ, ధనుంజయ, మహేశ్వరి, చందు, తేజ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.