బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ

0
1

మంగళగిరి పట్టణం కొత్తపేటలోని బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది. ఈ సందర్భంగా ఎంఈఓలు ఉషా కుమారి, బాబు మాట్లాడుతూ.

‘తల్లికి వందనం’, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం బోధనను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని, బడిబాట ద్వారా రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.