బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు

0
1

సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన కొయ్యాన లక్ష్మి ఉదయం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు.

ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సీతానగరం పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.

#RAJESH