బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|

0
20

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర స్వామి వారిని 133వ డివిజన్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లాలని ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 133వ డివిజన్ బిజెపి అధ్యక్షులు అజయ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్, ఉదయ్ ప్రకాష్, మహేష్ రాజ్, మల్లికార్జున్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal