బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాల్లో తీరిన నీటి కష్టాలు! 💧🚚
ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల పరిధిలోని బి. అగ్రహారం మరియు పరమాన్ దొడ్డి గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి కొరతను గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు, ఈ సమస్యను మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె, బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివనీలకంఠ గారితో మాట్లాడి యుద్ధప్రతిపాదికన తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయించారు. ఈ ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో అండగా నిలిచిన బుట్టా కుటుంబానికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










