విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ చేసిన ఆయన, దారుశిల్పుల సమస్యలపై గళమెత్తారు. ముఖ్యంగా కొండపల్లి బొమ్మల తయారీకి ‘తెల్లపునికి’ చెట్ల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ 12న జరగనున్న ఎన్నికల్లో తనకు, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి పొట్లూరు చిరంజీవి ఆచార్యకు ‘ఆవు దూడ’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు నిరంతరం పోరాడుతానని రామకృష్ణ స్పష్టం చేశారు.










