అలిండియా అంబేద్కర్ యువజన సంఘం

0
1

నియామకాలతో పాటు ఘనంగా అశోక చక్రవర్తి జయంతి

పటాన్‌చెరువులోని అంబేద్కర్ భవనంలో అలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్. వరుణ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశానికి రాజ్యాంగమే శరణ్యమని ఉద్ఘాటించారు. అశోకుని సుపరిపాలన, శాంతి సందేశం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

అనంతరం, సంఘం బలోపేతానికి భాగంగా మండల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా కమ్మదనం నర్సింహులు, ఉపాధ్యక్షులుగా ఏర్పుల దయాకర్ నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కాడరం వినయ్ కుమార్, ఉపాధ్యక్షులు బేగరి రాజు సమక్షంలో ఈ నియామకాలు జరిగాయి. అశోకుని ఆశయాలను, అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నూతన బాధ్యులు ప్రతిజ్ఞ చేశారు.