కాపు జాతి గర్వించదగ్గ నాయకుడు ముద్రగడ: అపూర్వ స్వాగతం పలికిన గిరిబాబు.

0
3

కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు న్యాయపోరాటం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గురువారం కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు తనపై పెట్టిన అక్రమ కేసులు, దాడులకు తగిన మూల్యం చెల్లించుకునే వరకు వదిలిపెట్టనని హెచ్చరించారు.

తనపై ఎన్ని దాడులు చేసినా, వైఎస్ జగన్ అండతో, ముద్రగడ వంటి నాయకుల ఆశీస్సులతో న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు ఆ జాతి యావత్తు గర్వపడాలని అంబటి కొనియాడారు. ఈ భేటీలో ముద్రగడ గిరిబాబు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.