శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా పరిశీలించారు.
స్టేడియంలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు పరిపాలన భవనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, కాంట్రాక్టర్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
స్టేడియం పనులు త్వరగా పూర్తయ్యేలా చూసి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడా అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు కొనసాగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.










