ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

0
1

కుతుబుల్లాపూర్, బచుపల్లి, ,మల్లంపేట్ ,దుండిగల్, సూరారం, బౌరంపేట్ ,గాగిల్లాపూర్ లో, ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణంలో భాగంగా ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు.

‎ వేడుకల సందర్భంగా భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేడుకల కోసం ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీతారాముల కల్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రామాలయాలలో వేద మంత్రోచ్ఛారణల భాజాభజంత్రీలు, నడుమ ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణం జరుగుతుంది.