శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఊరేగింపు ని గ్రామంలోనీ ప్రతి విధుల్లో తిరిగి ఊరేగించిన అనంతరం స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ గొల్ల రాములు, మరియు కిష్టారెడ్డి, నాగిరెడ్డి, శ్రీను, రాజగోపాల్, సూర్య నారాయణ, డోకూరు నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.









