పుంగనూరు నియోజకవర్గంలోని రామాలయాలలో శుక్రవారం శ్రీరామనామి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు, మూలవిరాట్లకు పంచామృతాభిషేకాలు, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం స్వామి దేవరులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పూజల అనంతరం వడపప్పు, పానకము, స్వామివారి ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయాలలో ‘జైశ్రీరామ్’ నామస్మరణతో భక్తులు పులకించిపోయారు
# కొత్తూరు మురళి.










