హైదరాబాద్‌లో పెట్రోల్ కోసం బంకుల వద్ద జనం ఎగబడుతున్న వేళ, ‘హైదరాబాద్ యూత్ కరేజ్’ సంస్థకు చెందిన సయ్యద్ అయూబ్ ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు సాయం చేసే క్రమంలో కొందరు యువకులు ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేయగా.. అయూబ్ వారిని వారించారు.
“ఇక్కడ మతాన్ని తీసుకురాకండి, ఇలాంటి నినాదాలు వద్దు” అని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ఈయనపై క్రౌడ్ ఫండింగ్ మోసం ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం.










