ఎవరు మిగిలారు? ఎవరు బలి అయ్యారు? ఇరాన్ ప్రతిఘటన దళాల ప్రస్తుత పరిస్థితి.

0
3

ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు. ‘సరైన వ్యక్తులు’తో మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ వారు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.

అయితే, అమెరికా చర్చలు జరుపుతున్నది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గలీబాఫ్ అని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది.

దీంతో… అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

‎మరోవైపు.. ఏ స్థాయి ఇరాన్ ఉన్నతాధికారినైనా లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇటీవల ప్రకటించారు.

‎ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్‌లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

‎ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, నేను సంయుక్తంగా ఐడీఎఫ్‌కు స్పష్టమైన అధికారం ఇచ్చాం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఏ ఇరాన్ ఉన్నతాధికారినైనా గుర్తించిన వెంటనే, మళ్లీ ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండానే వారిని అంతం చేయవచ్చు” అని కాట్జ్ చెప్పారు.

కీలక నేతలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఇరాన్ నాయకత్వ వ్యవస్థలో ఇప్పుడు ఎవరెవరు జీవించి ఉన్నారు? ఎవరు మరణించారు? యుద్ధాన్ని, దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు?