మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.

0
3

శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ (7)తో కలిసి బైక్‌పై మదనపల్లెలోని బంధువుల ఇంటికి బయలుదేరారు.

మార్గమధ్యంలో మదనపల్లె రింగ్‌రోడ్ వద్దకు చేరుకోగానే, వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తాతా మనవరాలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.