శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
నిందితుడి అరెస్ట్‌పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్‌లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ.
.’నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.










