SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు

0
3

శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:

శ్రీకాకుళం జట్టు కళాసీల కూలీలకు సంబంధించిన రేట్లపై సంబంధిత వర్తకులతో శనివారం అధికారికంగా అగ్రిమెంట్ కుదిరింది.

ఎంతో కాలంగా తమ పనికి తగిన వేతనం పెంచాలని ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సంఘం నాయకులు తిరుపతిరావు తెలిపారు.

ఈ కొత్త ఒప్పందం నేటి నుండి మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు.

రోజుకు రూ.75లు వేతనం పెరిగినట్లు నాయకులు పేర్కొన్నారు.

స్థానిక పొట్టి శ్రీరాములు డైలీ మార్కెట్ వద్ద కూలీల పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.