ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని వైఎస్ఆర్ సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప కృషితో ఏర్పడిన ఈ సొసైటీలు వేలాది కుటుంబాలకు జీవనాధారమని, విలీనం వల్ల చేనేతల అస్తిత్వం, ఆస్తులు ప్రమాదంలో పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో వీటిని కలిపితే చేనేతలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయాలే తప్ప, విలీనం పేరుతో వారి ఉనికిని దెబ్బతీయకూడదని ఆమె స్పష్టం చేశారు.










