కొండపల్లి దర్గా భూములపై కుట్ర.. ముజావర్ల ఆవేదన!

0
1

ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములను కాపాడండి: అల్తాఫ్ బాబాకు వినతి

ఇబ్రహీంపట్నం కొండపల్లి ఖిల్లాపై ఉన్న హజరత్ గాలిబ్ షహీద్ దర్గాకు చెందిన వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని కాపాడాలని దర్గా ముజావర్లు ఏపీ అహేలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబాకు వినతిపత్రం సమర్పించారు. గొల్లపూడి, కొండపల్లి పరిధిలోని విలువైన భూముల ద్వారా దర్గాకు గానీ, 150 ముజావర్ కుటుంబాలకు గానీ ఎటువంటి ఆదాయం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా ఐఓసీ ప్లాంట్ కోసం భూములు తీసుకోవడం దుర్మార్గమని అల్తాఫ్ బాబా మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముజావర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, దర్గా అభివృద్ధికి షాదీఖానా, మదర్సాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.