పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో

0
0

శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో పర్యటించారు. దిగుపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. మజర మోట్లపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టిని శుభ్రపరిచి, నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు.

అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఇచ్చిన పోషకాహారాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు కొత్తూరు మురళి.