పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో అటవీ అధికారులు శనివారం ఏర్పాటు చేసిన సోలార్ కంచ సత్ఫలితాలనిస్తోందని తెలిపారు. గత నెలలో ఐదు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ కంచ, భీమవరం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపును అడవిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది.
సోలార్ కంచను దాటేందుకు ప్రయత్నించిన ఏనుగులకు షాక్ తగలడంతో అవి వెనుతిరిగాయి. ఈ పరిణామంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.










