వారపు సంత వేలం రికార్డు

0
3

చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.

నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో #GramaPanchayat ఉన్న చింతూరు సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రాష్ట్రాల గిరిజన ప్రజలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు ఇతర సరుకులను తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంత వేలంలో గిరిజన మహిళే ముందంజలో నిలిచి దక్కించుకోవడం విశేషం.