పేద విద్యార్థులకు అండగా ‘తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ – డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ

0
3

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ అధినేత డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. చీరాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా చేపట్టబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. 2012లో ప్రారంభమైన .

ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులకు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉచిత పాలిసెట్,ఎంసెట్ శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి స్థాయి శిక్షణ,ఉచిత భోజనం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూర్తి సమయం శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణా కాలంలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశ పరీక్షల్లో 10,000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ తరపున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.అనాథ పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు తల్లిదండ్రులు లేని పిల్లలకు, తండ్రి లేని విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7993085749 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.