మదనపల్లె మునిసిపల్ పార్క్ సమీపంలోని టీ డెన్ హోటల్లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్ యజమానులు శనివారం ఉదయం వచ్చి చూడగా.
రేకులకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ. 60 వేల నగదు, కరెంట్ స్టవ్, ప్రొజెక్టర్, హోమ్ థియేటర్, ఎల్ఈడి టీవీ, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు తదితర వస్తువులను అపహరించినట్లు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










