చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చీరాల శాసనసభ్యులు కొండయ్య ఆదేశాల మేరకు టిడిపి జెండా ఆవిష్కరించిన టిడిపి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గవిని నాగ శంకర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు 1982 లో స్థాపించారని, అప్పటి నుంచి నేటి వరకు టిడిపి పార్టీ ఉనికి తగ్గలేదని, నేడు పల్లె పల్లెలో టిడిపి జెండా ఆవిష్కరించారని తెలిపారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కులాయి వేయిస్తున్నారని ,చీరాల ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో గవినివారిపాలెం గ్రామానికి రెండు కోట్లు పైగా నిధులు మంజూరు చేశారని వారికి గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలియజేశారు.
అనంతరం టిడిపి నాయకులు గవిని మణికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముఖ్య కారణం బలహీన వర్గాలని బలపరచడానికేనని, బలహీనవర్గాలంతా ఎన్టీఆర్ కి టిడిపి పార్టీకి ఎల్లప్పుడు కార్యకర్తలుగా అండగా ఉంటారని అన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య దయతో చీరాలలో రామరాజ్యం నడుస్తుందని, నియోజవర్గమంతా అభివృద్ధి బాటలో నడుస్తుందని వారు తెలిపారు.కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు బుర్ల మురళి, గోన బోయిన దుర్గాప్రసాద్,నీటి సంఘాల అధ్యక్షులు గవిని శ్రీనివాసులు,నక్కల లక్ష్మణ్, గవిని అయ్యప్ప, కొమ్మనబోయిన రమణయ్య, వళ్ళు పాపారావు,దబ్బుకుట్టి శ్రీనివాసరావు, జంగిలి గోపి,గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










