పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం

0
1

పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ K. సోమరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ ఏరివేత, రైన్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్ వంటి పనులు చేపట్టారు.

కళాశాల ప్రాంగణంలోని చెత్తను శుభ్రం చేశారు. పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, హరిత వాతావరణం నెలకొల్పడానికి ప్లాస్టిక్ రహిత వాతావరణం ముఖ్యమని కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు, వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్ తెలిపారు# కొత్తూరు మురళి.