సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
ఆదివారం వార్డు-5 పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన “ఓపెన్ జిమ్’ ను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేయగలమని, అందుకే ప్రభుత్వం కాలనీలు, బస్తీల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
స్థానిక ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సాల్మన్, కోశాధికారి సుఖ్ ధామ్, చంద్రశేఖర్, నాయకులు పెద్దాల నరసింహ, నాగేందర్ యాదవ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal.









